ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
పాడేరు : జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి నిర్వహించే ఇంటర్మీడియెట్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, బెంచీలు ఏర్పాటు చేశారు.
జూనియర్ కళాశాలలు, విద్యార్థుల వివరాలు
జిల్లాలో గల జూనియర్ కళాశాలల్లో 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 17 గిరిజన గురుకుల కళాశాలలు, 19 కేజీబీవీ కళాశాలలు, 16 ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు, ఐదు హెచ్‌ఎస్ కళాశాలలు ఉన్నాయి. మొదటి సంవత్సరం పరీక్షలకు 6,518 మంది, మొదటి సంవత్సరం ఒకేషనల్ పరీక్షలకు 1,545 మంది, రెండో సంవత్సరానికి 5,335 మంది, ఒకేషనల్ పరీక్షలకు 1,322 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో పాడేరు డివిజన్‌లో 4,672 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 3,352 మంది రెండో సంవత్సరం విద్యార్థులు, 919 మంది మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు, 703 మంది ఒకేషనల్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రంపచోడవరం, చింతూరు డివిజన్లలో 1,846 మంది మొదటి సంవత్సరం జనరల్, 1,983 మంది రెండో సంవత్సరం జనరల్, 626 మంది మొదటి సంవత్సరం ఒకేషనల్, 619 మంది రెండో సంవత్సరం ఒకేషనల్ పరీక్షలకు హాజరుకానున్నారు.
621 సీసీ కెమెరాలు
రంపచోడవరం, చింతూరు డివిజన్లలోని పరీక్ష కేంద్రాల్లో 251 సీసీ కెమెరాలు, పాడేరు డివిజన్‌లో 370 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 784 మంది సిబ్బందిని ఇన్విజిలేటర్లుగా నియమించారు.
పరీక్ష సమయం, కేంద్రాల వివరాలు
ఇంటర్ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రంలో ప్రవేశం లేదు. జిల్లా వ్యాప్తంగా పాడేరు డివిజన్‌లో పది పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా రంపచోడవరం, చింతూరు డివిజన్లలో 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాజవొమ్మంగి, అడ్డతీగల, వీఆర్ పురం పరీక్ష కేంద్రాలను సమస్యాత్మక పరీక్ష కేంద్రాలుగా గుర్తించారు.
జిల్లా వ్యాప్తంగా 26 పరీక్ష కేంద్రాలు
అన్ని పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు
784 మంది ఇన్విజిలేటర్ల నియామకం
పటిష్ట పోలీస్ బందోబస్తు
పరీక్ష సమయాల్లో 144వ సెక్షన్ అమలు
పరీక్షల నిర్వాహణ, సమాచార సేకరణ కోసం కంట్రోల్ రూం ఏర్పాటు
పకడ్బందీగా ఏర్పాట్లు
ఇంటర్మీడియెట్ పరీక్షల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. కట్టుదిట్టమైన భద్రత నడుమ పరీక్షలు నిర్వహిస్తాం. పరీక్ష కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాం. పరీక్ష కేంద్రాలకు కిలోమీటర్ దూరంలో జెరాక్స్, ఇంటర్‌నెట్ సెంటర్లు మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. 144వ సెక్షన్ అమలులో ఉంటుంది. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. పరీక్షల నిర్వహణ, సమాచార సేకరణ కోసం ప్రత్యేకంగా 7382638698 నంబర్‌తో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశాం.
– దినేష్‌కుమార్, కలెక్టర్
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
Comments
Please login to add a commentAdd a comment