బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు
● జిల్లా కార్మిక శాఖ అధికారి సుజాత
పాడేరు : బాల కార్మికులను పనిలో పెట్టుకునే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కార్మిక శాఖ అధికారి టి.సుజాత హెచ్చరించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పునరావాసంలో భాగంగా శుక్రవారం పాడేరు పట్టణంలోని పలు సంస్థలు, దుకాణాలు, హోటళ్లలో జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ తనిఖీలు చేపట్టింది. ఆయా చోట్ల నిర్వాహకులతో మాట్లాడి బాల కార్మిక వ్యవస్థపై అవగాహన కల్పించారు. జిల్లా సహాయ కార్మిక శాఖ అధికారి పి.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పోలవరం గ్రామసభలు వాయిదా
చింతూరు: ఈనెల ఒకటి, మూడో తేదీల్లో చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో జరగాల్సిన పోలవరం ఆర్‌అండ్‌ఆర్ గ్రామసభలను వాయిదా వేస్తున్నట్లు ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి అభిషేక్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. తదుపరి గ్రామసభల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
స్పోర్ట్స్ స్టైఫండ్ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం
పాడేరు : ప్రతిభ చూపిన క్రీడాకారుల నుంచి 2025–26 సంవత్సరానికి స్పోర్ట్స్ స్టైఫండ్ అవార్డు కోసం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎ.జగన్‌మోహన్‌రావు శుక్రవారం ఓప్రకటనలో తెలిపారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల గ్రామీణ/పట్టణ క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్ క్రీడల్లో యువకులు, టేబుల్ టెన్నిస్, బాడ్మింటన్, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్‌లలో ప్రతిభ కనబరిచిన యువతు లు అర్హులు. అర్హులైనవారు www.fci.gov.in వెబ్‌సైట్లో ఆన్‌లైన్ ద్వారా మార్చి 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment