రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
జి.మాడుగుల: పాడేరు రోడ్డు మార్గంలో గన్నేరుపుట్టు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై బైక్ అదుపు తప్పి ప్రమాదం జరిగింది. జి.మాడుగుల నుంచి ఎన్‌హెచ్–516ఈ రోడ్డు మార్గంలో మంగళవారం రాత్రి 7:15గంటలకు సొలభం పంచాయతీ గొడుగురాయి గ్రామానికి చెందిన యువకుడుని తెలుస్తోంది. మోటర్ బైక్‌పై పాడేరు వైపు వెళుతుండగా బైక్ అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యాడు.ఈ ప్రమాదంలో యువకుడు తీవ్రగాయాలై అపస్మారకస్థితిలో ఉన్నాడు. ప్రమాద సంఘటన సమాఛారం తెలుసుకున్న పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు 108వాహనానికి ఫోన్ చేసి పంపించారు.వాహనంలో పాడేరు జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంపై పోలీస్‌లకు ఫిర్యాదు అందాల్సింది.
హైవే రోడ్డు నిర్మాణ పనుల వద్ద హెచ్చరిక బోర్డులు లేకనే ప్రమాదాలు....!
ఈ విషయంపై పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ హైవే రోడ్డు మార్గంలో పెద్దపెద్ద గోతులు తవ్వి, అలాగే డైవర్షన్లు ఏర్పాటు చేసి వదిలి పెట్టటంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.హైవే నిర్మాణం పనులు జరుగుతున్నా, కనీసం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి సమయాల్లో రాకపోకలు సాగించే వాహనదార్లుకు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.జాతీయ రహదారి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. హైవే ఆథారిటీ అధికారులు కనీస చర్యలు చేపట్టకపోవటం విచారకరమన్నారు. తక్షణమే నిబంధనల మేరకు వాహన ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment