‘యువత పోరు’కు సిద్ధం కావాలి
● ఘనంగా వైఎస్సార్‌సీపీఆవిర్భావ దినోత్సం నిర్వహించాలి ● అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
అరకులోయటౌన్/అనంతగిరి(అరకులోయటౌన్): వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు యువత, అన్ని వర్గాల ప్రజలు సిద్ధం కావాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపు నిచ్చారు. సోమవారం అరకులోయ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, అనంతగిరిలోని పర్యాటక శాఖ హరిత రిసార్ట్స్‌లో యువత పోరు పోస్టర్‌ను పార్టీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రం పాడేరులో నిర్వహించే యువ త పోరుతో కూటమి ప్రభుత్వాన్ని నిలదీద్దామన్నా రు. విద్యార్థుల జీవితాలతో కూటమి సర్కార్ చెలగాటమాడుతోందని విమర్శించారు. నిరుద్యోగుల ను కూటమి నేతలు నమ్మించి నట్టేట ముంచారని, నిరుద్యోగ భృతి పేరుతో వంచించారన్నారు. ఈనెల 12న వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని అరకు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో వాడవాడలా ఘనంగా నిర్వహించాలన్నారు. మండల స్థాయి కమిటీల ఏర్పాటుకు నియోజకవర్గం ఇన్‌చార్జీలు చర్యలు తీసుకోవాలన్నారు. అరకులోయలో జరిగిన కార్యక్రమంలో జెడ్పీటీసీ శెట్టి రోషిణి, వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు అశోక్, పార్టీ మండల అధ్యక్షుడు స్వాభి రామ్మూర్తి, ఎంపీటీసీలు శతృఘ్న, స్వాభి రామచందర్, సర్పంచ్‌లు రమేష్, రాధిక, వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, నియోజకవర్గం గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు సుక్రయ్య, జిల్లా కార్యదర్శి శెట్టి అప్పాలు, ముఖ్య నాయకులు ఎల్.బి. కిరణ్, నరసింహరావు,విజయ్‌కుమార్, సంపత్‌కుమార్, గాశి, గరం పూర్ణ, మాజీ సర్పంచ్ గుడివాడ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి మండలంలో జరిగిన కార్యక్రమంలో శెట్టి నీలవేణి, పార్టీ మండల అధ్యక్షుడు సూర్యనారాయణ, నియోజకవర్గం ఎస్టీ సెల్ అధ్యక్షులు రేగబోయిన స్వామి, అంగన్‌వాడీ సెల్ అధ్యక్షులు పాడి కవిత, సర్పంచ్ పాగి అప్పారావు,నాయకులు దూరు గంగన్నదొర, గంగూలి కృష్ణమూర్తి, పార్టీ అనుభంద విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు.
యువతను మోసం చేసిన కూటమి ప్రభుత్వం
రంపచోడవరం: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని యువతను అన్ని రకాలుగా మోసం చేసిందని రంప చోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. రంపచోడవరంలో సోమవారం యువ త పోరు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 12న నిర్వహించే యు వతపోరు కార్యక్రమంలో పెద్దఎత్తున యువత పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసి, విద్యారంగంలో గొప్ప సంస్కరణలు తీసుకువచ్చింద న్నా రు. అందులో భాగంగా అమ్మ ఒడి, విద్యాకానుక, విద్యాదీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్‌మెంట్, నాడు–నేడు వంటి పథకాలను అమలు చేసిందని చెప్పారు. ఆంగ్ల విద్య విధానాన్ని తీసుకువచ్చిందన్నారు. విద్యతోనే పేదలు అభివృద్ధి చెందుతారని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భావించారని తెలిపారు. కానీ కూటమి పభుత్వం విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించిందని విమర్శించారు. వీధికో మద్యం దుకాణంతో ఆంధ్రాను మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేశారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లేక, కాలేజీ ఫీజులు కట్టలేక విద్యార్థులు మధ్యలో చదువుమానేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న కట్టించిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలన్నారు. యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని కోరారు. ఎంపీపీ బందం శ్రీదేవి, జెడ్పీటీసీ వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ బాలకృష్ణ, సర్పంచ్ మంగా బొజ్జయ్య, ఎంపీటీసీ నర్రి పాపారావు, సర్పంచ్ కోసు రమేష్‌బాబుదొర, నాయకులు బొబ్బా శేఖర్,కాపారపు రూతు, రాజన్నదొర, ఉప సర్పంచ్ వి.ఎం.కన్నబాబు, కొండ్రారాజు, పండు,కుంజం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
‘యువత పోరు’కు సిద్ధం కావాలి
Comments
Please login to add a commentAdd a comment