పక్కగా భూముల రీసర్వే
కలెక్టర్ దినేష్‌కుమార్
పాడేరు: భూముల రీసర్వేను గడువులోగా పక్కాగా పూర్తి చేయాలని కలెక్టర్ దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాడేరు డివిజన్‌కు చెందిన మండల సర్వేయర్లు, సర్వే డిప్యూటీ తహసీల్దార్లు, గ్రామ సర్వేయర్లతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వే చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించి, భూ సరిహద్దులను సక్రమంగా గుర్తించాలని చెప్పారు. సర్వే చేయడానికి ఎవరైన వసూళ్లకు పాల్పడితే క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. 22ఎ ప్రకారం భూమి రిజిస్ట్రేషన్‌కు ఫారం కె, ఫారం ఎల్ లను ఆన్‌లైన్ చేస్తామన్నారు. సర్వే నిర్వహిస్తున్నట్టు గ్రామస్తులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని, సర్వేపై గిరిజనులకు అవగాహన కల్పించాలని తెలిపారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ మాట్లాడుతూ భూముల రీసర్వేను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పాడేరు రెవెన్యూ డివిజన్‌లో మండలానికి రెండు గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని సర్వే చేస్తున్నట్టు చెప్పారు. పాడేరు డివిజన్ పరిధిలోని 375 గ్రామాల్లో సర్వే పూర్తి చేశారని, రికార్డు వర్క్ పూర్తి చేయాల్సి ఉందన్నారు. విలేజ్ సర్వేయర్ లాగిన్‌లో 89, వీఆర్వో లాగిన్‌లో 141, డిప్యూటీ తహసీల్దార్ లాగిన్‌లో 78 గ్రామాలకు చెందిన వర్క్ పెండింగ్‌లో ఉన్నట్టు చెప్పారు. గ్రామ సభలను నిర్వహించి నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. భూరికార్డుల క్రమబద్ధీకరణ త్వరితిగతిన పూర్తి చేయాలని చెప్పా రు. సక్రమంగా సర్వే చేయని సర్వేయర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్వే సహాయక సంచాలకుడు కె.దేవేంద్రుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment