సమస్యల సత్వర పరిష్కారానికి కృషి
రంపచోడవరం: అర్జీలను సత్వరం పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టు ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం తెలిపారు. స్థానిక ఐటీడీఏ సమావేశం హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కొన్ని సమస్యలను తక్షణం పరిష్కరిస్తున్నట్టు చెప్పారు. సబ్ కలెక్టర్ కె.ఆర్.కల్పశ్రీ, ఏపీవో డి.ఎన్.వి.రమణలతో కలిసి ఐటీడీఏ పీవో 116 అర్జీలను స్వీకరించారు. రబ్బరు ప్రొసెసింగ్ యూనిట్లు మంజూరు చేయాలని కానివాడ పంచాయతీలో 83 మంది రైతులు కోరారు. వై.రామవ రం మండలం అప్పర్ పార్ట్‌లోని బొడ్డగండి పంచా యతీలో ఉన్న మంగంపాడు, డొంకరాయి, బొడ్డగండిలను మూడు పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ఆయా ప్రాంతాల గిరిజనులు కోరారు. చింతలపూడి గ్రామంలో నిలిచిన రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆగ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. పందిరిమామిడికోట గ్రామంలో ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేయాలని రేవుల జానకిరెడ్డి, రేవు ల కృష్ణారెడ్డి తదితరులు కోరారు. డీఎల్‌ఎస్‌సీలో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించాలని జిల్లా వాల్మీకి సంఘం అధ్యక్షుడు గొర్లె చిన్న నారాయణరావు, గొర్లె రాజబాబు, నానిబాబు అర్జీలు అంద జేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని పోల వరం నిర్వాసితులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీడీ రుక్మాండయ్య, ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు పాల్గొన్నారు.
రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం
Comments
Please login to add a commentAdd a comment