సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం
సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స
పాడేరురూరల్: సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స తెలిపారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా మండలంలో మోదపల్లి,వంట్లమామిడి పంచాయతీల్లో సోమవారం ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ పీఎం జన్‌మన్ పథకం కింద రూ.10 లక్షలు మంజూరు చేయాలని, అటవీ శాఖ ఆంక్షలు ఎత్తివేసి పందిదూర్లు గ్రామానికి పక్కారోడ్డు నిర్మించాలని, గ్రామాల్లో తాగునీరు, రహదారులు తదితర మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజాసమస్యల పరిష్కారానికి ఈనెల 12న చలో వంట్లమామిడి సచివాలయం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే చలో కలెక్టరేట్ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సుందరరావు, సీపీఎం నాయకులు పాలికి లక్కు,దాసు, నాగేశ్వరరావు, చిన్నారావు, చిన్నయ్య, బాబురావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment