పట్టు
అరకొర ఆదాయం
సిల్క్ వస్త్రాల తయారీలో శిక్షణకు రంగం సిద్ధం
శరవేగంగా షెడ్ల నిర్మాణం
కూనవరం: చింతూరు డివిజన్‌లో ఇప్పటి వరకు పట్టు పురుగుల పెంపకం, పట్టు కాయల విక్రయం ద్వారా ఆదాయం పొందుతున్న కుటుంబాలకు సిల్కు దుస్తుల తయారీలో శిక్షణ ఇచ్చి, అదనపు ఆదాయం లభించే మార్గం చూపాలని ఐటీడీఏ అధికారులు భావిస్తున్నారు. ఇటీవల నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ టీం అమరావతి నుంచి చింతూరు డివిజన్ కేంద్రానికి వచ్చింది. చింతూరు ఐటీడీఏ పరిధిలో సాగవుతున్న టస్సర్ పట్టు పంటను పరిశీలించింది. సాగుచేస్తున్న రైతులతో సమావేశం నిర్వహించింది. పట్టు వస్త్రాల తయారీకి కావలసిన విధి విధానాలపై చర్చించింది. పట్టు దుస్తుల తయారీలో శిక్షణకు ఏర్పాట్లు చేయాలని సెరీకల్చర్ డిపార్ట్‌మెంటుకు సూచించింది. ఐటీడీఏ సహకారంతో పట్టు దుస్తుల తయారీ శిక్షణపై సెరీకల్చర్ డిపార్ట్‌మెంటు దృష్టి సారించింది. ఈక్రమంలోనే షెడ్లనిర్మాణం చకచకా జరుగుతున్నాయి.
చింతూరు డివిజన్ వ్యాప్తంగా మూడు మండలాల్లో 800 కుటుంబాలకు చెందిన 1600 మంది గిరిజన రైతులు పట్టు పంటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. టస్సర్ (దసలి) పట్టు సాగుచేస్తున్న రైతులు ఇప్పటి వరకు పట్టు కాయల అమ్మకం, సిల్కు దారం తీయడం ద్వారా వచ్చే అరకొర ఆదాయంతో బతుకు బండిని లాగుతున్నారు.ఈ పనిలేనప్పుడు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషిస్తున్నారు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ఐటీడీఏ, సెరీకల్చర్ ఉన్నతాధికారులు సంయుక్తంగా శిక్షణపై దృష్టి సారించారు. దారం తీయడంతో సరిపెట్టడం కంటే పట్టు చీరలు, పట్టు వస్త్రాల తయారు చేస్తే రెట్టింపు ఆదాయ వస్తుందన్న ఆలోచనకు వచ్చారు. ఆ మేరకు పైదిగూడెం వేదికగా సిల్కు వస్త్రాల తయారీపై శిక్షణ ఇప్పించేందుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. శిక్షణ పొందిన వారితో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఇక్కడే పట్టు వస్త్రాలు తయారు చేసి, విక్రయించనున్నారు. ఇది ప్రారంభమైతే రాష్ట్రంలో చింతూరు డివిజన్ సిల్కు దుస్తుల తయారీకి మొదటి కేంద్రంగా నిలుస్తుంది.
పైదిగూడెంలో త్వరలో ప్రారంభం
800 కుటుంబాలకు మేలు
పట్టు
పట్టు
పట్టు
Comments
Please login to add a commentAdd a comment