కొలంబో చేరుకున్న ఐఎన్‌ఎస్ కుతార్
సింథియా (విశాఖ) : హిందూ మహా సముద్రంపై శ్రీలంక, భారత్‌ల సముద్ర సంబంధాలను బలోపేతం చేసే దిశగా.. తూర్పు నావికాదళానికి చెందిన ఈస్ట్రర్న్ ఫ్లీట్ షిప్ ఐఎన్‌ఎస్ కుతార్ కొలంబో చేరుకున్నట్లు నేవీ వర్గాలు తెలిపాయి. దీంతో ఓడ కమాండింగ్ ఆఫీసర్ కమాండర్ నితిన్ శర్మ.. శ్రీలంక నేవీ వెస్ట్రన్ నేవల్ ఏరియా కమాండర్ రియర్ అడ్మిరల్ ఎంహెచ్‌సీజె శిల్వా నుంచి స్వాగతం అందుకున్నారు. అనంతరం ఇరుదేశాల నావికాదళాల మధ్య వృత్తిపరమైన, ఉమ్మడి కార్యాకలాపాలపై కార్యచరణను రూపొందించడంతోపాటు రెండు దేశాల మధ్య దీర్ఘకాల భాగస్వామ్యపంపై చర్చించినట్లు నేవీ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment