చింతపల్లి, జీకే వీధిల్లోసీఐఐ బృందం పర్యటన
చింతపల్లి: జిల్లాలో కాఫీ సాగు, మార్కెటింగ్, ప్రభుత్వాల సహకారం వంటి అంశాలపై వివరాలు సేకరించేందుకు న్యూఢిల్లీ నుంచి వచ్చిన సీఐఐ బృందం సభ్యులు మంగళవారం చింతపల్లి, జీకేవీధి మండలాల్లో పర్యటించారు. కాఫీతోటలను సందర్శించడంతోపాటు మాతో ట రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విజన్–2047 కార్యక్రమం కింద చేపడుతున్న డాక్యుమెంటేషన్‌లో భాగంగా కాఫీ సాగుపై ప్రత్యేకంగా వివరాలను సేకరిస్తున్నట్టు బృందంలోని ఎకనామికల్ ఎక్సర్ట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీవాస్తవ తెలిపారు. ఈకార్యక్రమంలో మాతోట సీఈవో చిన్నారావు, గిరిజన వికాస్‌సంస్థ సీఈవో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment