మాతాశిశు మరణాలు నివారించాలి
● జిల్లా వైద్యాధికారి జమాల్ బాషా
పాడేరు రూరల్: మాతాశిశు మరణాల నివారణకు వైద్య సిబ్బంది కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి జమాల్ బాషా తెలిపారు. మండలంలోని ఈదురుపాలెం పీహెచ్‌సీని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆశా కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ మాతాశిశు మరణాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో ఎవరికై నా టీబీ లక్షణాలుంటే గుర్తించి, పరీక్షలు చేయించాలని తెలిపారు. టీబీ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెలా పౌష్టికాహారానికి రూ.1,000 చొప్పున ఆరు నెలల పాటు ప్రభుత్వం అందిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీబీ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు,డాక్టర్లు శ్రీను,నరసింహ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment