● నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
పాడేరు: సివిల్ సర్వీస్ పరీక్షకు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లా వేపగుంట యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన ఆసక్తి గల యువత ఈనెల 6నుంచి 13 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు ఫారాలు ఐటీడీఏ కార్యాలయం వద్ద అందుబాటులో ఉన్నట్టు పేర్కొన్నారు. 14,15 తేదీల్లో హాల్ టికెట్లను జారీ చేస్తామని, 16న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. మొదటి స్క్రీనింగ్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 20 నుంచి 22 వరకు రెండో స్క్రీనింగ్ టెస్ట్ కోసం హాల్ టికెట్లను జారీ చేస్తామని తెలిపారు. ఐటీడీఏ పరిధిలో డిగ్రీ ఉత్తీర్ణులైన గిరిజన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment