సెల్‌ఫోన్ల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలి
చింతూరు: సెల్‌ఫోన్లు వినియోగించే విషయంలో మహిళలు తగిన జాగ్రత్తలు పాటించాలని చింతూరు సీఐ దుర్గాప్రసాద్ అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన మహిళా సాధికారత అవగాహనా సదస్సులో సీఐ మాట్లాడుతూ తమ సొంత విషయాలను సెల్‌ఫోన్ల ద్వారా ఇతరులకు పంపడం వల్ల సైబర్ నేరాల బారిన పడుతున్నారన్నారు. మాదక ద్రవ్యాల కారణంగా యువత తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని తెలిపారు. ఎస్‌ఐ రమేష్ మాట్లాడుతూ మహిళలు తమ సెల్‌ఫోన్లలో పోలీసులకు సంబంధించిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ప్రమాద సమయాల్లో ఉపయోగ పడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థినులకు వారు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రత్నమాణిక్యం, అధ్యాపకులు వెంకటరావు, పద్మ, శకుంతల, శ్రీదేవి, హారతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment