డుంబ్రిగుడ: ఉత్తరాంధ్ర శాసన మండలి ఎన్నికల ఫలితాల సందర్భంగా రాష్ట్ర మంత్రి అచ్చెంన్నాయుడు యూటీఎఫ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహేశ్వరరావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కూటమి పార్టీల మద్దతుతో పోటీ చేసిన పాకలపాటి రఘువర్మను ఉపాధ్యాయులు ఓడించడాన్ని జీర్జించుకోలేక యూటీఎఫ్‌కు మంత్రి అచ్చెంనాయుడు పార్టీల రంగులు పులమండం తగదన్నారు. విద్యా రంగంలో ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాలే రఘువర్మ ఓటమికి కారణమన్నారు. ఈసమావేశంలో జిల్లా కార్య దర్శి ఎస్.కన్నయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.బాలకృష్ణ, రాజారావు పాల్గొన్నారు.
పలు రైళ్ల రద్దు
తాటిచెట్లపాలెం(విశాఖ) : ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల నిమిత్తం పలు రైళ్లు ఆయా తేదీల్లో రద్దు చేస్తున్నట్లు, మరికొన్ని గమ్యం కుదిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. విశాఖపట్నం–బ్రహ్మపూర్(18526) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 6,7వ తేదీల్లోను, బ్రహ్మపూర్–విశాఖపట్నం(18525) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 7, 8వ తేదీల్లో రద్దయినట్లు పేర్కొన్నారు.
విశాఖపట్నం–పలాస గమ్యం కుదింపు
విశాఖపట్నం–పలాస(67289) పాసింజర్ ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు(శుక్ర, ఆదివారం తప్ప) శ్రీకాకుళం రోడ్ వరకు మాత్రమే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో పలాసలో బయల్దేరాల్సిన పలాస–విశాఖపట్నం(67290) పాసింజర్ ఈ నెల 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు (శుక్ర, ఆదివారం తప్ప) పలాస నుంచి కాకుండా శ్రీకాకుళం నుంచి బయల్దేరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment