విశాఖ సిటీ: వీఎంఆర్‌డీఏలో తహసీల్దార్ (భూసేకరణ)గా విధులు నిర్వర్తిస్తున్న కోరాడ వేణుగోపాల్‌పై వరుస ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఎస్.రాయవరం తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలో చేసిన అవినీతి, అక్రమాలపై విచారణ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చట్టపరంగానే కా కుండా సర్వీస్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకో వాలని సీఎం, డిప్యూటీ సీఎం, హెచ్‌ఆర్‌డీ మంత్రి, డీజీపీ, సీసీఎల్‌ఏ, ఇతర అధికారులతో పాటు వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌కు కూడా రాతపూర్వకంగా ఫిర్యా దులు చేశారు. గతంలో తప్పుడు ధృవపత్రాలు సమర్పించి ఎంపీటీసీ, ఎంపీపీలుగా గెలిచినట్లు నిర్ధారణ అయినప్పటికీ.. ఎన్నికల్లో వారిని అనర్హులుగా ప్రకటించని వేణుగోపాల్‌పై విచారణ చేసి క్రిమినల్ చ ర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. ఇటువంటి ఆరోపణలు ఉన్న వేణుగోపాల్‌ను హోం మంత్రి అనిత పీఎస్‌గా నియమించాలని ప్రయత్నిస్తుండడం సరైన నిర్ణయం కాదని వారు లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment