పీఎం ఇంటర్న్‌షిప్‌నకు దరఖాస్తుల ఆహ్వానం
సీతంపేట: పీఎం ఇంటర్న్‌షిప్ స్కీం–2025 నమోదు ఈనెల 12తో ముగియనుందని, అర్హులైన వారు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ లేబర్ కమిషనర్ ఎం.రామారావు తెలిపారు. అక్కయ్యపాలెం మెయిన్‌రోడ్‌లోని కార్మిక శాఖ కార్యాలయంలో గురువారం యూనియన్ నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఎం ఇంటర్న్ షిప్ ఏడాది కాలం వ్యవధి ఉంటుందని, ప్రతి నెల రూ.5 వేలు ఆర్థిక సాయంతో పాటు, మరో రూ.6వేలు ఒకసారి ఆర్థిక సాయం అందించనున్నట్టు తెలిపారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ పీఎం ఇంటర్న్‌షిప్ స్కీం నమోదు ప్రక్రియను ప్రారంభించిందని pminternship. mca.gov.in వెబ్ సైట్‌లో ఈనెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్న్ షిప్ దరఖాస్తు ద్వారా వివిధ రంగాల్లో అవకాశాలు పొందవచ్చన్నారు. 21 నుంచి 24 ఏళ్ల గల విద్యావంతులు అర్హులని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment