జాతీయ సమైక్యత శిబిరంలో ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ల ప్రతిభ
అభినందించిన ఏయూ వీసీ రాజశేఖర్
పాడేరు: ఎన్‌ఎస్‌ఎస్ రీజనల్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ ఎస్‌వోఏ యూనివర్సిటీలో నిర్వహించిన జాతీయ సమైక్యత శిబిరంలో పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు ప్రతిభ చూపారు. ఈ శిబిరానికి ఏయూ ఎన్‌ఎస్‌ఎస్ విభాగం తరపున పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి హాజరయ్యారు. ఏడు రోజులపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రతిభ చూపారు. గ్రూప్ డ్యాన్స్ (కూచిపూడి) విభాగంలో ఏయూ ఎన్‌ఎస్‌ఎస్ టీం ప్రథమ బహుమతి సాధించింది. ఈ బృందంలో పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు కూడా సభ్యులుగా ఉన్నారు. వీరితోపాటు పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి జి.గౌరీశంకర్‌ను గురువారం ఆంధ్ర యూనివర్సిటీలో వీసీ రాజశేఖర్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment