ఎఫ్‌సీఐలో సాయుధ దళాలకు ముగిసిన శిక్షణ కోర్సు
ఆరిలోవ: విశాఖ ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్‌స్టిట్యూట్(ఎఫ్‌సీఐ)లో భారత సాయుధ దళాలకు చెందిన ఫ్రీ రిటైర్మెంట్ కోర్సు విద్యార్థులకు శిక్షణ నిర్వహించారు. డిప్లమో ఇన్ టూరిజం అండ్ హాస్పిటాలటీ మేనేజ్‌మెంట్ కోర్సులో 24 వారాల పాటు ఇచ్చిన శిక్షణ గురువారంతో ముగిసింది. నగరంలో ఎన్‌సీసీ ప్రధాన కార్యాలయం అడ్మిన్ కల్నల్ అమితాబ్ కుమార్ ముఖ్యఅతిథిగా, గౌరవ అతిథులుగా ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎంఏవీ రామకృష్ణ, డిఫెన్స్ జాయింట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రోగ్రాం విద్యా సలహాదారు డాక్టర్ ఉజ్వల కుమార్ ఘటక్ పాల్గొని శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం కోర్సుకు సంబంధించిన ఉపయోగాలు, నైపుణ్యం గురించి ఎఫ్‌సీఐ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటరమణ వివరించారు. పర్యాటక కార్యకలాపాలు, ఆతిథ్య నిర్వహణ, కస్టమర్ సేవలు, ఈవెంట్ ప్లానింగ్ తదితరవాటి గురించి తెలియజేశారు. కార్యక్రమంలో ఇన్‌స్ట్రక్టర్లు పార్ధసారథి, కుముదిని, లీలాప్రయదర్శిని, జాషువా, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment