‘మీ కోసం’లో143 అర్జీలు
పాడేరు : సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ దినేష్‌కుమార్ అన్నారు. ఐటీడీఏ కార్యాలయం సమావేశ మందిరంలో శుక్రవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ దినేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో పద్మలత 143 వినతులు స్వీకరించారు. తాగునీటి సమస్య, భూ సమస్యలు, గృహాల మంజూరు, అటవీ హక్కుల పత్రాల మంజూరు కోరుతూ పలువురు అర్జీలను అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ బాబు, డీఆర్డీఏ పీడీ మురళి, టీడబ్ల్యూ డీడీ రజనీ, డీఎంహెచ్‌వో డాక్టర్ జమల్‌బాషా, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment