కొండకు నిప్పు
డుంబ్రిగుడ: కొంతమంది ఆకతాయిలు నిప్పుపెట్టడంతో మండల కేంద్రం డుంబ్రిగుకు సమీపంలో గల కొండపై మంటలు చెలరేగా యి. సంతవలస గ్రామ సమీపంలోని కొండపై చెట్లు, మొక్కలు దగ్ధమయ్యాయి. గురువారం చెలరేగిన మంటలు శుక్రవారం నాటికి కూడా అదుపులోకి రాలేదు. దీంతో సమీప గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
జీడిమామిడి తోటలు దగ్ధం
రాజవొమ్మంగి: మండలంలోని అప్పలరాజుపేట శివారు కొండపోడు భూముల్లో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు మూడు ఎకరాల్లోని జీడిమామిడి తోటలు దగ్ధమయ్యాయి. ఏసు, రాజు సాగు చేస్తున్న ఈ జీడిమామిడి తోటలు ప్రస్తుతం పూత, పిందెల దశలో ఉన్నాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment