విజయోస్తు సీ్త్రరస్తు..
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా.. అటు ఇటు అన్నింటా, నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంటా బయట... అలుపని రవ్వంత అననే అనవంట... వెలుగులు పూస్తావు వెళ్లే దారంత... అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేస్తున్న ‘ఆమె’కు వందనం అంటోంది జగతి. అమ్మగా, ఆలిగా, అక్కగా, చెల్లిగా.. ఆత్మీయతతో అనురాగాన్ని పంచే..అమృతమూర్తికి పాదాభివందనం చేస్తోంది.
గిరిజన సేవే పరమావధిగా...
సాక్షి,పాడేరు: గిరిజనులకు సేవ చేయడమే పరమావధిగా పాడేరు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.హేమలతాదేవి తన కేరీర్ ప్రారంభం నుంచీ కృషి చేస్తూ తోటి గిరిజన వైద్యులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేసేందుకు అవకాశం లభించినా ఆదివాసీలకు వైద్యసేవలందించేందుకే ఆమె మొగ్గు చూపుతూ జిల్లాలో పలు ప్రాంతాల్లో సేవలందించారు. చింతపల్లి మండలం లబ్బంగిలో 1963 సంవత్సరం జనవరి 11న గిరిజన దంపతులు నారాయణరావు,చంద్రవతిలకు జన్మించిన హేమలతాదేవి అనకాపల్లిలో టెన్త్,ఇంటర్ చదివారు.తండ్రి నారాయణరావు సివిల్ ఇంజనీర్‌గా పనిచేశారు.ఆమె భర్త తమర్భ బాబూరావునాయుడు రిటైర్డ్ గిరిజన ఐఏఎస్ అధికారి. ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి అయిన వెంటనే జి.కె.వీధి మండలంలో అప్పటిల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన పెదవలస పీహెచ్‌సీలో ఏడాది పాటు కాంట్రాక్టు వైద్యురాలిగా పనిచేసి తోటి గిరిజనులు సేవలందించారు. పీజీ అనంతరం జి.మాడుగుల పీహెచ్‌సీలో 1992లో ప్రభుత్వ రెగ్యులర్ వైద్యురాలిగా తొలిపోస్టింగ్ లభించింది. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వివిధ హోదాల్లో పనిచేసినా గిరిజన రోగులకు వైద్యసేవలందించడంపైనే దృష్టిసారించారు. 2023 సెప్టెంబర్ నెలలో ఆమెకు అడిషనల్ డీఎంఈగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.అయితే కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పూర్తిస్థాయి సూపరింటెండెంట్‌గా విధుల్లో చేరాలని మిత్రులు,కుటుంబ సభ్యుల నుంచి వత్తిడి వచ్చినప్పటికీ గిరిజన ప్రాంతంలో పనిచేయాలనే ఆలోచనతో పాడేరు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా రావాలని నిర్ణయించుకున్నారు.ఆమె ఆలోచన విధానానికి తగ్గట్టుగానే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పాడేరు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా సెప్టెంబర్ 2023లో నియమించింది. మెడికల్ కళాశాల ప్రారంభానికి ముందే ప్రిన్సిపాల్‌గా విధుల్లో చేరిన ఆమె పాడేరు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా 2024 జనవరి వరకు గిరిజనులకు వైద్యసేవలందించారు. ప్రస్తుతం పాడేరు మెడికల్ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా ఉత్తమ సేవలు అందిస్తున్నారు.వైద్య వృత్తిని చేపట్టిన నాటి నుంచి వైద్య వృత్తిలో విశేష సేవలందించారు. ఆమె అనేక ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు.
సమాజ శ్రేయస్సే ధ్యేయంగా...
విజయోస్తు సీ్త్రరస్తు..
విజయోస్తు సీ్త్రరస్తు..
Comments
Please login to add a commentAdd a comment