గిరిజన యువతులుడ్రైవింగ్‌లో శిక్షణ పొందాలి
రంపచోడవరం: గిరిజన యువతులు డ్రైవింగ్‌లో శిక్షణ పొంది, ఉపాధి అవకాశాలు పొందాలని రంపచోడవరం సబ్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ అన్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్కిల్ హబ్‌లో సంకల్ప కార్యక్రమాన్ని శుక్రవారం సబ్ కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ డ్రైవింగ్ వృత్తి మగ వారు మాత్రమే చేసేది అనే భావన తొలగిపోవాలని, గిరిజన మహిళలు డ్రైవింగ్ నేర్చుకోవాలన్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి రోహిణి మాట్లాడుతూ సంకల్ప కార్యక్రమం ద్వారా మల్టీ స్కిల్ ప్రోగ్రాంను కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రారంభించినట్టు చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వసుధ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment