అశ్వినీ ఈజ్ ద ‘బెస్ట్’
దేశంలోనే నాణ్యమైన
కాఫీ గింజలు పండించిన గిరి మహిళ
పెదబయలు: మనసు పెట్టి రంగంలోకి దిగితే విజయం దాసోహం కావాలసిందేనని గిరి మహిళలు నిరూపిస్తున్నారు. మండలంలోని లక్ష్మీపేట కప్పాడ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ కిల్లో అశ్విని గత ఏడాది దేశంలోనే నాణ్యమైన కాఫీ గింజలు పండించి, పురస్కారం అందుకున్నారు. గత ఏడాది బెంగళూరులో జరిగిన ప్రపంచ కాఫీ సదస్సులో ప్లేయర్ ఆఫ్ ఇండియా ది ఫైన్ కప్ అవార్డు ఆమెకు లభించింది. ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో తమకున్న ఎకరన్నర పోడు భూమిలో ఎలాంటి ఎరువులు వినియోగించకుండా ఆర్గానిక్ పద్ధతిలో కాఫీ సాగు చేస్తున్నట్టు చెప్పారు.నాణ్యమైన కాఫీగా గుర్తింపు రావడంతో చాలా మంది వ్యాపారవేత్తలు ఎంవోయూ కుదుర్చుకోవడానికి తమ గ్రామానికి వచ్చారని ఆమె తెలిపారు. ప్రతి ఏడాది తాము పండించిన కాఫీ శాంపిళ్లను భర్త గాసన్న సహకారంతో సదస్సులకు పంపుతున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment