పాడేరు : అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని శనివారం పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అద్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు క్యాంపు కార్యాలయంలో నిర్వహించనున్నట్టు వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, పార్టీ మహిళ విభాగ జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆదేశాలతో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన మహిళ పార్లమెంట్ సభ్యులు, జెడ్పీ చైర్‌పర్సన్, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మహిళ సర్పంచ్‌లు, ఎంపీటీసీ, పార్టీ శ్రేణులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment