శరభన్నపాలెం ఎంపీటీసీ సోమాగాంధీ మృతి
కొయ్యూరు: వైఎస్సార్ సీపీ నాయకుడు, శరభన్నపాలెం ఎంపీటీసీ సభ్యుడు లోకుల సోమాగాఽంధీ మృతికి పలువురు సంతాపం ప్రకటించారు. ఎంపీపీ బడుగు రమేష్, పాడేరు మాజీ ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి, అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు తెడబారికి సురేష్‌కుమార్, జల్లి సుధాకర్, టీడీపీ నాయకులు ప్రసాద్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ మేరకు శరభన్నపాలెంలో సోమాగాంధీ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, ధైర్యం చెప్పారు. పార్టీ ఆవిర్బావం నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న సోమాగాంధీ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ మేరకు కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, నలుగరు పిల్లలున్నారు. పరామర్శించిన వారిలో నాయకులు రవి, సుధాకర్, సర్పంచ్ కిముడు సత్యనారాయణ తదితరులున్నారు.
కుటుంబానికి అండగా ఉంటాం
కొయ్యూరులో పార్టీని బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరించిన సోమాగాంధీ మరణం పార్టీకి తీరని లోటని మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి చెప్పారు. ఆమె మాట్లాడుతూ ఈ విషయాన్ని పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. సురేష్ కుమార్, జల్లి సుధాకర్, నేతలు సోమాగాఽంధీ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
కుటుంబాన్ని పరామర్శించిన
వైఎస్సార్‌సీపీ నాయకులు
శరభన్నపాలెం ఎంపీటీసీ సోమాగాంధీ మృతి
Comments
Please login to add a commentAdd a comment