బ్యాంకు అధికారుల తీరుపై ధ్వజం
డుంబ్రిగుడ: కించుమండ స్టేట్ బ్యాంకు అధికారిపై విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కించుమండ గ్రామానికి చెందిన దుర్గమ్మ డ్వాక్రా సంఘం సభ్యులు శుక్రవారం ఆందోళన చేపట్టి అనంతరం పాడేరులో జరిగే మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ దినేష్‌కుమార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు, కార్యదర్శి అమ్మి, సీతమ్మ మాట్లాడుతూ 2009లో బ్రిడ్జిలోన్ ద్వారా రూ. 1లక్ష, బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 50 వేలు సంఘ సభ్యులు రుణాన్ని పొందినట్టు తెలిపారు. పొదుపుతో పాటు తీసుకున్న రుణాన్ని దశల వారీగా చెల్లించే వారమని గుర్తు చేశారు. కరోనా సమయంలో రుణా న్ని చెల్లించలేకపోయామన్నారు. గతంలో పసుపు కుంకుమ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆసరా పథకం ద్వారా సంఘ సభ్యుల ఖాతాలో రూ.2లక్షలు మేర జమ అయ్యిందన్నారు. వెలుగు అధికారులతో తీర్మాణం చేయించి జమ అయిన ఆయా నగదును తీసుకోవడానికి బ్యాంక్‌కు వెళ్లగా, రుణ బకాయి ఉన్నట్టు అధికారులు ప్రకటించారని పేర్కొన్నారు. ఏడాదిగా బ్యాంకు చుట్టూ తిప్పంచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సత్వరమే బ్యాంకు అధికారుల తీరుపై విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని వినతిలో పేర్కొన్నట్టు వారు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment