క్షౌరవృత్తిదారుల సమస్యలు పరిష్కరించాలి
రంపచోడవరం: ఏజెన్సీలో తరతరాలుగా క్షౌ ర వృత్తి చేసుకుంటూ జీవన సాగిస్తున్న నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలని ఏజెన్సీ నాయీ బ్రహ్మణ సంఘం నాయకులు సూదికొండ వెంకటేశ్వరరావు, బండారు నాగేశ్వరరావు, ఎం కృష్ణ భగవాన్ అన్నారు. రంపలో శుక్రవారం క్షౌ రవృత్తిదారుల మా సంఘం మా అభివృద్ధిపై సదస్సు నిర్వహించారు.ఏజెన్సీ 11 మండలాల్లోని క్షౌ రవృత్తిదారులు పాల్గొన్నారు. రంపచోడవరంలో ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్, అల్లూరి సీతారామరాజు, భగత్‌సింగ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రంపలో జరిగిన సదస్సులో పలు తీర్మానాలు చేశారు. ఏజెన్సీలో క్షౌ రవృత్తిదారుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నారు. అర్హులందరికీ ఆన్‌లైన్ చేసి రుణాలు మంజూరు చేయాలని కోరారు. రంపచోడవరం నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు నరవ రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముమ్మిడివరపు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment