కలెక్టర్ సాయంతో క్యాన్సర్ రోగి విశాఖ తరలింపు
పెదబయలు: పెదబయలు పీహెచ్‌సీ పరిధిలోని అడుగులపుట్టు పంచాయతీ వడ్డేపుట్టు గ్రామానికి చెందిన క్యాన్సర్ రోగి కిల్లో శరభన్నను కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించామని గోమంగి పీహెచ్‌సీ వైద్యాధికారి చైతన్య తెలిపారు. కొన్ని నెలలుగా నోటి క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్న శరభన్న ఆస్పత్రి ఖర్చులు భరించలేక స్వగ్రామానికి ఇటీవల తిరిగి వచ్చాడు. విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ దినేష్‌కుమార్ ఆస్పత్రి ఖర్చులకు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చి, తనను పంపించారని డాక్టర్ చైతన్య చెప్పారు. రోగిని గోమంగి పీహెచ్‌సీ అంబులెన్స్‌లో విశాఖపట్నం తరలించామని, మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స ప్రారంభించారని వైద్యాధికారి తెలిపారు. కలెక్టర్, డీఎంహెచ్‌వో ఈ కేసుకు సంబందించి ఆస్పత్రి వైద్య నిపుణులతో మాట్లాడారని
తెలిపారు.
కలెక్టర్ సాయంతో క్యాన్సర్ రోగి విశాఖ తరలింపు
Comments
Please login to add a commentAdd a comment