భూముల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌నుసద్వినియోగం చేసుకోండి
సాక్షి, పాడేరు: ఆన్‌లైన్ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను సద్వినియోగం చేసుకోవాలని,కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ గిరిజనులను కోరారు. స్థానిక కుమ్మరిపుట్టు రోడ్డులో మొదటి సారిగా జాయింట్ సబ్ రిజిష్టర్ కార్యాలయాన్ని శనివారం ఆయన ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్రతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో భూముల క్రయ, విక్రయాలన్నీ స్టాంప్ పేపర్స్‌పై రాసుకునేవారని, ఎల్‌టీఆర్ చట్టం ప్రకా రం తహసీల్దార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్ జరిగేదన్నారు. భూముల యాజమానులంతా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా రు. ఈ మేరకు ఫారం–కె, ఫారం–ఎల్ పై గిరిజన రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తామన్నారు. సబ్ రిజిష్టర్ కార్యాలయాలను పాడేరు, రంపచోడవరంలో ప్రారంభించడం శుభ పరిణామన్నారు. ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ సబ్ రిజిష్టర్ కార్యాలయాలు ప్రారంభం వలన గిరిజనులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై గిరిజనులకు సమగ్రంగా అవగాహన కల్పించాలన్నారు. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ జి.బాలకృష్ణ మాట్లాడుతూ గిరిజన చట్టాలకు లోబడి భూముల రిజిస్ట్రేషన్ జరుగుతుందన్నారు. ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా డాక్యుమెంట్లను నిరంతరం పొందవచ్చన్నారు. జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్లు పెరిగితే అరకు లోయ, ఇతర మండలాల్లోను సబ్ రిజిష్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇరు జంటలకు రిజిస్ట్రేషన్ పత్రాలను కలెక్టర్, దినేస్‌జడ్పీచైర్‌పర్సన్‌లు పంపిణీ చేశారు. జేసీ డాక్టర్ అభిషేక్‌గౌడ, జిల్లా రిజిష్టర్ డి.ఉపేంద్రరావు, జాయింట్ సబ్ రిజిష్టర్ కె.రమేష్, సీనియర్ సహయకులు రమేష్, ,చింతలవీధి, లగిశపల్లి సర్పంచ్‌లు సీతమ్మ, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment