కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు
అరకులోయ టౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అరకులోయ జెడ్పీటీసీ శెట్టి రోషిణి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ.. జగనన్న ప్రభుత్వ హయాంలో మహిళలకు పెద్దపీట వేశారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మహిళలు అన్ని రంగాల్లో వెనుకబడ్డారన్నారు. వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, ఎంపీపీ రంజపల్లి ఉషారాణి, వైస్ ఎంపీపీ కొర్రా సుమాంజలి, సర్పంచ్ పెట్టెలి సుశ్మిత, ఎంపీటీసీ మొర్దోన్ లలిత కుమారి, ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు కె.అశోక్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గెడ్డం నర్శింగరావు, అరకు నియోజకవర్గం గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు పెట్టెలి సుక్రయ్య, పార్టీ మండల అధ్యక్షుడు స్వాభి రామ్మూర్తి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు
Comments
Please login to add a commentAdd a comment