వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో..
పాడేరు: మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలపడి సమాజంలో గౌరవంగా బతకాలని, మహిళల ముఖాల్లో చిరునవ్వు ఉండాలన్నదే జగనన్న అభిమతమని జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని శనివారం పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆదేశాల మేరకు ఆయన క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, జీకే వీధి జెడ్పీటీసీ సభ్యురాలు కిముడు శివరత్నం, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు కిల్లో ఊర్వశీరాణి, మహిళ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పార్టీ మహిళా నాయకులు పాల్గొని కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళాలోకం బాగుంటేనే గ్రామం, రాష్ట్రం, దేశం బాగుంటుందని నమ్మిన జగన్‌మోహన్‌రెడ్డి ఆయన ప్రభుత్వ హయాంలో మహిళలను ప్రోత్సహించేందుకు 32కు పైగా పథకాలను మహిళల పేరిట ఇచ్చారని, 50 శాతానికి పైగా పదవులు ఇచ్చారని, మహిళల రక్షణ కోసం దిశ వ్యవస్థను నెలకొల్పారన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్రను పార్టీ నాయకులు, మహిళ ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.మంగ్లన్నదొర, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు వనుగు బసవన్నదొర పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment