జీఆర్‌ఎంబీ బృందం సీలేరు కాంప్లెక్స్ సందర్శన
సీలేరు: సీలేరు కాంప్లెక్స్‌లో జలాశయాలను, జల విద్యుత్ కేంద్రాలను గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్‌ఎంబీ) బృందం శనివారం విస్తృతంగా తనిఖీ చేసింది. బలిమెల నీటి పంపకాలు, వాడుకలపై ఇరు రాష్ట్రాల అధికారులతో చర్చించారు. అనంతరం గుంటవాడ (సీలేరు) రిజర్వాయర్‌ను సందర్శించారు. అనంతరం జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే రెగ్యులేటర్ డ్యాంను, గేట్ల పనితీరును పరిశీలించారు. అనంతరం పార్వతీనగర్ వద్ద నిర్మాణం చేపట్టిన పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు గురించి వివరాలను అడిగారు. ఎస్‌ఈ చంద్రశేఖర్ రెడ్డి ప్రాజెక్టు విశేషాలు వివరించారు. అనంతరం పవర్ కెనాల్, డొంకరాయి, జలాశయాలను జీఆర్‌ఎంబీ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా జీఆర్‌ఎంబీ చైర్మన్ అజయ్‌కుమార్ ప్రధాన్ మాట్లాడుతూ గోదావరి నదికి సంబంధించి వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ బోర్డును ఏర్పాటు చేసిందని చెప్పారు. ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల, జోలాపుట్ జలాశయాల నీటి వాడకాన్ని రెండు రాష్ట్రాలు స్నేహపూర్వకంగా నిర్వహిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జీఆర్‌ఎంబీ సభ్యుడు టివీఎస్ కిరీటి, సీలేరు కాంప్లెక్స్ ముఖ్య ఇంజనీరు వాసుదేవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment