మహిళలు సమాజానికి వెన్నెముక
హుకుంపేట: మహిళలు అన్ని విషయాల్లో ముందుండి మహారాణులుగా రాణించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సీడీపీవో బాలచంద్రమణి దేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా సర్పంచ్‌లను, ఎంపీటీసీలను, ఐసీడీఎస్ సిబ్బందిని, మహిళా పోలీసులను శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు సమాజానికి వెన్నెముక, వారిని భద్రంగా కాపాడుకోవాలన్నారు. వైస్ ఎంపీపీ ప్రియాంక, స్థానిక సర్పంచ్ సమిడ వెంకటపూర్ణిమ, సీఐ సన్యాసినాయుడు, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిరి రవిప్రసాద్, నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడు రేగం శివరామ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment