పకడ్బందీగా స్వమిత్వ సర్వే
పాడేరు: జిల్లాలో దేవీపట్నం మండలం మినహా మిగిలిన 21 మండలాల్లో చేపట్టనున్న స్వమిత్వ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి లవరాజు ఆదేశించారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో డివిజన్ స్థాయి స్వమిత్వ సర్వే శిక్షణ శిబిరం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్వమిత్ర సర్వేను పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, ఎంపిక చేసిన 21 గ్రామాల్లో గ్రామ కంఠం భూములను ముందుగా సర్వే చేయాలన్నారు. రంపచోడవరం, చింతూరు డివిజన్ పరిధిలో 10 మండలాలకు రంపచోడవరం ఎంపీడీఓ కార్యాలయంలో శిక్షణ అందజేస్తామని చెప్పారు. అసిస్టెంట్ సర్వే ఇన్‌స్పెక్టర్ వెంకటరావు, గ్రామ సచివాలయల కో ఆర్డినేటర్ పీఎస్ కుమార్, ఈవోపీఆర్డీ రమేష్, డిజిటల్ అసిస్టెంట్లు, సర్వేయర్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment