మే 11నుంచి మోదకొండమ్మ తల్లి జాతర
సాక్షి, పాడేరు: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, గిరిజనుల దేవత పాడేరులోని మోదకొండమ్మతల్లి రాష్ట్ర గిరిజన ఉత్సవాలను ఈ ఏడాది మే 11, 12, 13 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అధ్యక్షతన ఆలయ కమిటీ ప్రతినిధులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, రాజకీయ పార్టీల నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, వర్తకులు, అన్ని వర్గాల భక్తులతో ఆదివారం మోదకొండమ్మతల్లి ఆలయంలో సమావేశం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఉత్సవాల నిర్వహణకు ముహూ ర్తం నిర్ణయించడంతో మే నెల 11 నుంచి మూడు రోజులు ఉత్సవాలు నిర్వహించేందుకు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు తేదీలను ప్రకటించారు.
అమ్మవారి రుణం తీర్చుకుంటా..
ఈ ఏడాది మోదకొండమ్మతల్లి ఉత్సవాలను తానే స్వయంగా ఘనంగా నిర్వహించి, అమ్మవారి రు ణం తీర్చుకుంటానని ఆలయ కమిటీ అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ప్రకటించారు. మోదకొండమ్మతల్లి 39వ ఉత్సవాలకు నూతన ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును అన్ని వర్గాల పెద్దలు స్వాగతించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ ఈ ఏడాది కూడా మోదమ్మ రాష్ట్ర గిరిజన జాతరను అ న్ని వర్గాల భక్తుల సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా ఉత్సవాలకు సహకరించాలన్నారు. ఉత్సవ కమిటీ పూర్తి కార్యవర్గాన్ని తొందరలోనే ప్రకటిస్తామన్నా రు. మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు, మాజీ సర్పంచ్ వర్తన పిన్నయ్యదొర, ఉమా నీలకంఠేశ్వరస్వామి ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, ఉపాధ్యాయ సంఘం నేతలు పలాసి కృష్ణారావు, జంపరంగి ప్రసాద్, కిల్లు రామ్మూర్తినాయుడు, ఎంపీటీసీ సభ్యురాలు గిడ్డి విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ శివకుమార్, పలు రాజకీయ పార్టీల నేతలు సీదరి రాంబాబు, సీదరి మంగ్లన్నదొర, కురుసా పార్వతమ్మ, కూడా సురేష్‌కుమార్, లకే రామసత్యవతి, ఐశ్వర్యరాణి, సల్లా రామకృష్ణ, కేజీయారాణి, కూడి చిట్టిబాబు, కూడి వలసంనాయుడు, కూడా సుబ్రహ్మణ్యం, ఉత్సవ కమిటీ సభ్యులు ఉడా త్రినాథ్, లకే రత్నాలమ్మ, వెంకటరమణ, రాధాకృష్ణ, కొణతాల సతీష్, హరి, కొమ్మెజు రమణ, వర్తక సంఘం ప్రతినిధులు బూరె డ్డి రామునాయుడు, ఇమ్మిడిశెట్టి అనీల్, పూసర్ల గోపి, కొణతాల ప్రశాంత్, గోపినాయుడు, గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయులు, వర్తకులు పాల్గొన్నారు.
ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా
పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
Comments
Please login to add a commentAdd a comment