సావిత్రిబాయి పూలే సేవలు ఆదర్శనీయం | - | Sakshi
Sakshi News home page

సావిత్రిబాయి పూలే సేవలు ఆదర్శనీయం

Published Tue, Mar 11 2025 12:49 AM | Last Updated on Tue, Mar 11 2025 12:47 AM

సావిత

సావిత్రిబాయి పూలే సేవలు ఆదర్శనీయం

పాడేరు రూరల్‌: సావిత్రిబాయి పూలే సేవలు అందరికీ ఆదర్శనీయమని గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడ రాధాకృష్ణ అన్నారు. గిరిజన సమాఖ్య, స్టార్‌ సొసైటీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి అణగారిన వర్గాల మహిళల కోసం ఎంతో కృషి చేశారన్నారు. ప్రతి ఒక్కరూ ఆమెను ఆదర్శవంతంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్‌ సొసైటీ కన్వీనర్‌ భాను, నాయకులు వెంకి, జగదీష్‌, లక్ష్మి, ప్రసన్న, కుమారి, తదితరులు పాల్గొన్నారు.

మహిళా లోకానికి దిక్సూచి సావిత్రిబాయి

ముంచంగిపుట్టు: మహిళా లోకానికి దిక్సూచి సావిత్రిబాయి పూలే అని హెచ్‌ఎం ఎం.ధర్మారావు అన్నారు. మండలంలోని జర్రెల పంచాయతీ సెల్లుంపుట్టు మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో సావిత్రిబాయి చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ధర్మారావు మాట్లాడుతూ విద్య ద్వారానే సీ్త్ర విముక్తి సాధ్యమని నమ్మి, మహిళల్లో చైతన్యం తీసుకువచ్చి చదువుకునేలాగా సావిత్రిబాబు ప్రోత్సహించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు ఆర్‌.కామేష్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సావిత్రిబాయి పూలే సేవలు ఆదర్శనీయం 1
1/1

సావిత్రిబాయి పూలే సేవలు ఆదర్శనీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement