డ్రగ్స్, సారా రహిత సమాజం కోసం కృషి
ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ సుర్జిత్ సింగ్
గంగవరం: డ్రగ్స్, సారాలతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయిని, డ్రగ్స్, సారా రహిత సమాజం కోసం మహిళలు, యువత కృషి చేయాలని ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ సుర్జిత్ సింగ్ అన్నారు. సోమవారం నిర్వహించిన నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీరామచంద్రమూర్తి ఆదేశాల మేరకు అనకాపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎకై ్స జ్ అసిస్టెంట్ కమిషనర్ సుర్జిత్ సింగ్ ఎకై ్సజ్ పోలీసు సిబ్బందితో కలిసి పాతరామవరం గ్రామాన్ని సందర్శించి గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా సుర్జిత్ సింగ్ మాట్లాడుతూ సమాజం బాగుండాలంటే దురవ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్, గంజాయి, సారా వంటివి సమాజంపై చూపిస్తున్న దుష్ఫలితాలపై అవగాహన కల్పించారు. అనంతరం నాటుసారా వల్ల కలిగే నష్టాలు, డ్రగ్స్ వినియోగం, ఆ కేసుల్లో పడే శిక్షలు గురించి కళాకారులు కళాప్రదర్శన ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్, రంపచోడవరం ఎకై ్సజ్ సీఐ శ్రీధర్, ఎస్‌ఐ బి.వెంకటేష్, భయ్యనపల్లి సర్పంచ్ బూరుకట్ల పార్వతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment