సీపీఎల్ టోర్నీ విజేత వీఆర్‌పురం
చింతూరు: స్థానిక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చింతూరు ప్రీమియర్ లీగ్(సీపీఎల్) క్రికెట్ టోర్నమెంట్‌లో వీఆర్‌పురం వారియర్స్ జట్టు విజేతగా నిలిచింది. సోమవారం చింతూరు క్రికెట్ అసోసియేషన్ జట్టుతో జరిగిన ఫైనల్ పోరులో ఆ జట్టు 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వీఆర్‌పురం వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీస్కోరు చేసింది. జట్టులో ఓపెనర్ గౌతమ్ 31 బంతుల్లో 58 పరుగులు చేయగా అభిరాం 45, సునీల్ 32 పరుగులు చేశారు. 222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చింతూరు క్రికెట్ అసోసియేషన్ 19.2 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. జట్టులో ప్రవీణ్‌ప్రకాష్ 23 బంతుల్లో ఆరు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 58 పరుగులు చేసి ధాటిగా ఆడినా మరోవైపు వరుసగా వికెట్లు కోల్పోవడంతో జట్టు పరాజయం పాలైంది. వీఆర్‌పురం జట్టులో నిఖిల్ మూడు, జయంత్, జయ్ రెండేసి వికెట్లు తీశారు. విజేత జట్టుకు రూ.30 వేలు, రన్నరప్‌కు రూ.20 వేల నగదు బహుమతిని నిర్వాహకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మేడేపల్లి సుధాకర్, జనసేన మండల అధ్యక్షుడు మడివి రాజు, సీనియర్ క్రీడాకారులు షహిన్‌షా, నాగేశ్వరరావు, చిన్నబ్బి, అసోసియేషన్ సభ్యులు గణేష్, ప్రదీప్, రమేష్, సూరి, బుచ్చిరాజు, శంకర్, సురేష్, గంగరాజు, బిట్టు, అర్జున్, అంజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment