వలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి
చింతూరు: వలంటీర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ డిమాండ్ చేశారు సోమవారం చింతూరులో జరిగిన వలంటీర్ల ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిష్కారం కోసం ఈనెల 17న నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. వలంటీరు వ్యవస్థను కొనసాగిస్తామని, రూ.10 వేలు వేతనం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వారిని మోసం చేసిందని విమర్శించారు. వలంటీర్లకు ఉద్యోగభద్రత కల్పించడంతో పాటు రాజీనామా చేసిన వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలలు గడుస్తున్నా వారి సమస్యలు పరిష్కారం కావడంలేదని, ప్రభుత్వ తీరుతో రెండున్నర లక్షల వలంటీర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఇదే ధోరణి కొనసాగితే వలంటీర్లతో కలసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వలంటీర్ల యూనియన్ మండల కార్యదర్శి కలుముల మహేష్, భూక్యా కుమార్, గడ్డల వనరాజ్, రామిరెడ్డి, రాజు, లక్ష్మణ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment