పాఠశాలలో వేదిక నిర్మాణానికి విరాళం
అరకులోయటౌన్: అరకులోయ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సోమవారం అరకులోయ సీఐ ఎల్.హిమగిరి సందర్శించారు. పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న వేదికను గమనించారు. ఇందుకు గల కారణాలను హెచ్‌ఎం టి.మోహన్‌రావును అడిగి తెలుసుకున్నారు. తక్షణం వేదిక నిర్మాణం పూర్తి చేయాలని రూ.10 వేల నగదును హెచ్‌ఎంకు సీఐ అందజేశారు. అనంతరం విద్యార్థులతో సమావేశమై గుడ్ టచ్, బేడ్ టచ్‌పై అవగాహన కల్పించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల జోలి పోవద్దని, ఆన్‌లైన్ మోసాలకు గురికావద్దని సీఐ సూచించారు. ఈ ఏడాది 10వ తరగతి విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎరుకుల శ్రీనివాసరావు, రోజారాణి, మీనా, లోకేశ్వరి, ఆనందరావు, మత్స్యరాజు, మాణాక్యమ్మ, ట్రైనీ మహిళా ఎస్‌ఐలు శకుంతల, భావ్య, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment