అస్మదీయులకు అడ్డగోలుగా వ్యవసాయ పరికరాలు
రంపచోడవరం: స్థానిక ఐటీడీఏ పరిధిలోని ఉద్యానవన శాఖ పీహెచ్‌వో, కార్యాలయం ఉద్యోగులు రహస్యంగా లబ్ధిదారులను ఎంపిక చేసి, పరికరాలను పంపిణీ చేస్తున్నారని రంపచోడవరం ఎంపీపీ బందం శ్రీదేవి సోమవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. తమకు కావలసిన వ్యక్తులకు మాత్రమే రహస్యంగా సమాచారం ఇచ్చి, వ్యవసాయ యంత్రాలు, పనిముట్లను పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిలో అంతర్యమేమిటో పీహెచ్‌వో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మండల ప్రథమ పౌరురాలైన తనకు కనీసం పథకాలు మంజూరు, పంపిణీ సమాచారం ఇవ్వకపోవడం, పరికరాలు పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం ప్రొటోకాల్‌కు విరుద్ధమని, దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.ఐటీడీఏ ఉద్యానవన శాఖలో జరుగుతున్న అక్రమాలపై నిగ్గుతేలుస్తామని పేర్కొన్నారు.
రంపచోడవరం ఎంపీపీ బందం శ్రీదేవి
Comments
Please login to add a commentAdd a comment