కూలి పనులకు వచ్చిన వీరంతా గుంపులు గుంపులుగా వాగుల వద్ద,గోదావరి ఇసుక దిబ్బలపై నివాసం ఉంటారు. నీటి సౌకర్యం ఉన్న చోట గుడారాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తారు. వారి వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలను వండుకుని, సూర్యుడు ఉదయించక ముందే వారి వెంట తీసుకుని మిర్చి తోటల్లో కాయలు కోసేందుకు వెళ్లిపోతారు. కొద్ది గంటలు పనులు చేశాక వారి వెంట తెచ్చుకున్న భోజనాన్ని సమానంగా పంచుకుని తోటల్లోనే తింటారు.ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే కొంత సమయం చెట్ల నీడనే సేదతీరి ఆ వెంటనే మళ్లీ పనులకు ఉపక్రమిస్తారు. మళ్లీ సూర్యుడు అస్తమించాక వీరి నివాస ప్రాంతాలకు వెళ్లిపోతారు.