
శబరి, జటాయువులకు మోక్షం సిద్ధించిన ప్రాంతం.. శ్రీరాముడు
వీఆర్‌పురం: మండలంలోని శ్రీరామగిరి ఆలయం... రామదాసు భద్రాచల దేవాలయాన్ని నిర్మించడాని ముందునుంచే ఉందని పురాణాల ద్వారా తెలుస్తోంది. భద్రాచలం పట్టణానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో, గోదావరి నదికి ఉపనది అయిన శబరి ఒడ్డున ఎత్తైన కొండలు, ఆహ్లాదకరమైన ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ స్వామి సుందర రాముడిగా పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయాన్ని మాతంగ ముని నిర్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.
శ్రీరామగిరికి ఆ పేరు ఎలా వచ్చిందంటే..
ఇక్కడ స్వామి ధ్యానం చేస్తున్న సమయంలో ముఖంలో తేజస్సు వెలువడి ఎంతో సుందరంగా కనిపించాడట అందుకే ఇక్కడ వెలసిన శ్రీరాముడిని సుందర రాముడిగా, ధ్యానం చేసినందన యోగ రాముడిగా పిలుస్తారు. శ్రీరాముడు ధ్యానం చేసిన గిరి కాబట్టి ఆప్రాంతానికి శ్రీరామగిరి అనే పేరు వచ్చింది.
కల్యాణ ఉత్సవాలకు ఇక్కడే శ్రీకారం...
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి శ్రీకారం చుట్టేది శ్రీరామగిరిలోనే... శ్రీరామగిరిలో జరిగే కల్యాణోత్సవాల్లో తలంబ్రాల ప్రక్రియ ముగిస్తే కానీ భద్రాచలం రాములవారి పెళ్లి తంతు ప్రారంభం కాదు. ఇక్కడ నుంచే భద్రాచలం ఆలయానికి తలంబ్రాలు పంపుతారు. ఏటా ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు.
పోలవరం ప్రాజెక్టుతో
కనుమరుగు కానుందా..
సుమారు 80 అడుగుల ఎత్తులో కొండపై ఉన్న ఈ ఆలయానికి చేరుకోడానికి భక్తులు 170 మెట్లు ఎక్కి వెళతారు. అంత ఎత్తులో ఉన్న ఈ ప్రాచీన పుణ్యక్షేత్రం పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి పూర్తిగా కనుమరుగు కానున్నట్టు నివేదికలు వెల్లడించాయి. అదే జరిగితే ఒక గొప్ప పర్యాటక ప్రదేశాన్ని, రాముడు నడయాడిన పుణ్యభూమిని, పురాతన కట్టడాన్ని మనం కోల్పోయినట్టే.
ఏర్పాట్లు పూర్తి చేశాం
శ్రీరామనవమి సందర్భంగా కల్యాణమహోత్సవాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు, దేవదాయశాఖ అధికారులతో కలిసి ఏర్పాట్లు పూర్తి చేశాం. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు చలువ పందిళ్లు, మంచినీటి వసతి, అన్న సమారాధన కార్యక్రమాలు చేపడుతున్నాం.
– పెందుర్తి సుదర్శన రావు,
ఆలయ కమిటీ చైర్మన్
అందరి సహకారంతో ..
శ్రీరామగిరిలో సీతారాముల కల్యాణమహోత్సవాన్ని అందరి సహకారంతో ఏటా మాదిరిగా వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. శనివారం నుంచి 10 తేదీ వరకూ కల్యాణమహోత్సవాలు జరుగుతాయి.
– పురుషోత్తమాచార్యులు,
ఆలయ ప్రధాన అర్చకులు

శబరి, జటాయువులకు మోక్షం సిద్ధించిన ప్రాంతం.. శ్రీరాముడు

శబరి, జటాయువులకు మోక్షం సిద్ధించిన ప్రాంతం.. శ్రీరాముడు

శబరి, జటాయువులకు మోక్షం సిద్ధించిన ప్రాంతం.. శ్రీరాముడు