
ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి
జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర
ముంచంగిపుట్టు: గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు దృష్టి పెట్టాలని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర తెలిపారు. మండల కేంద్రం ముంచంగిపుట్టులోని చైర్‌పర్సన్ నివాసంలో వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నేతలు, కార్యకర్తలతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ముందుగా పంచాయతీల వారీగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిత్యం గ్రామాల్లో పర్యటించి, ప్రజలకు అండగా ఉంటూ మౌలిక సదుపాయాలు కల్పనే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను కలుపుకొని పోతూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ కృషి చేయాలని చెప్పారు. తాగునీటి పథకాలు, రహదారుల ప్రారంభోత్స కార్యక్రమాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలను భాగస్వామం చేసే విధంగా అధికారులను సూచించినట్టు తెలిపారు. అఽధికారులు ప్రొటోకాల్ పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తన దృష్టికి తీసుకురావాలన్నారు. వైఎస్సార్‌సీపీని నమ్ముకున్న క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆమె చెప్పారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు, అరకు నియోజకవర్గం గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు గల్లెల అర్జున్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు వెంగడ రమేష్, వైస్‌ఎంపీపీ సిరగం భాగ్యవతి, మండల ప్రధాన కార్యదర్శి ఎం.రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.