
జాతీయ క్రీడాకారుడు లోహిత్‌కు అరకు ఎంపీ అభినందనలు
డుంబ్రిగుడ: ఇటీవల విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం ప్రాంతాల్లో జరిగిన జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సత్తాచాటి, వివిధ పతకాలను సాధించిన శెట్టి లోహిత్‌ను అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి అభినందించారు. మండల కేంద్రంలో బుధవారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఎంపీ పాల్గొని అనంతరం లోహిత్ గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అరకు ఎంపీ తనూజారాణి మాట్లాడుతూ జాతీయస్థాయిలో వివిధ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రదర్శన కనబర్చి, పతకాలు సాధించిన లోహిత్‌ను అభినందించారు. మరిన్ని పోటీల్లో విజయం సాధించి మన్య ప్రాంత ఖ్యాతిని చాటాలని, గిరిజన క్రీడాకారులకు ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. క్రీడారంగంలో ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, జెడ్పీటీసీ సభ్యురాలు చటారి జానకమ్మ, వైస్ ఎంపీపీల లలిత, బబిత తదితరులున్నారు.