
మర్రిగూడెం గ్రామాన్ని ఫేజ్1బి లో కలపాలి
కూనవరం: మర్రిగూడెం గ్రామాన్ని ఫేజ్1బిలో కలపాలని కోరుతూ ఆ గ్రామానికి చెందిన పోలవరం నిర్వాసితులు ధవళేశ్వరంలో ఆర్‌అండ్‌ఆర్ అడ్మినిస్ట్రేటివి అధికారి అభిషేక్‌ను ధవళేశ్వరంలో శుక్రవారం కలసి వినతిపత్రం అందజేశారు. మా గ్రామాన్ని 2022లో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముంపులో గుర్తించి అన్ని సర్వేలు చేశారని, అవార్డ్ ఎంక్వయిరీ గ్రామసభ మాత్రమే నిర్వహించాల్సి ఉందని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. దీనిపై అడ్మినిస్ట్రేటివ్ అధికారి సానుకూలంగా స్పందించారని, ఈవిషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే ఆగ్రామానికి పరిహారం అందే విధంగా కృషిచేస్తానని చెప్పినట్లు వారు తెలిపారు.