నర్సీపట్నం : రత్నమ్మ మెమోరియల్ ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిప్టింగ్ పోటీల్లో నర్సీపట్నం రూరల్ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ కె. శ్రీనివాసరావు గోల్డ్ మోడల్ సాధించారు. మాస్టర్స్ కేటగిరిలో 95 కిలోల విభాగంలో కాంస్య పతకం, రెడ్ లిప్టు 110 కేజీల విభాగంలో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించారు. శ్రీనివాసరావును, కోచ్ లోవరాజును ట్రైనీ డీఎస్పీ చైతన్య , రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ, టౌన్ సీఐ గోవిందరావు అభినందించారు. ట్రైనీ డీఎస్పీ మాట్లాడుతూ జాతీయస్థాయి పవర్ లిప్టింగ్ పోటీలకు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు అర్హత సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment