లిక్విడ్ గంజాయితో యువకుడి అరెస్ట్
కె.కోటపాడు : యాసస్ ఆయిల్(గంజాయి లిక్విడ్)ను తరలిస్తున్న యువకుడిని మంగళవారం ఎ.కోడూరు ఎస్‌ఐ లక్ష్మినారాయణ పట్టుకున్నారు. ఆయన తెలిపిన వివరాలివి. ఆనందపురం కూడలి వద్ద సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సందర్భంలో అనుమానస్పదంగా సంచరిస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన షేక్ మహ్మద్ జాకీర్ అనే వ్యక్తి బ్యాగ్‌ను తనిఖీ చేయగా 900 గ్రాముల యాసస్ ఆయిల్(గంజాయి లిక్విడ్)ను గుర్తించినట్టు ఎస్‌ఐ తెలిపారు. ఈ గంజాయి లిక్విడ్‌ను ఏజెన్సీ ప్రాంతం నుంచి తీసుకువస్తున్నట్టు నిందితుడు అంగీకరించాడన్నారు. ఆనందపురం మీదుగా అనకాపల్లికి వెళ్లే ప్రయత్నంలో అతను పట్టుబడినట్టు తెలిపారు. పట్టుబడ్డ యాసస్ ఆయిల్ విలువ రూ.20వేలు ఉంటుందన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హజరుపర్చగా రిమాండ్‌కు విధించినట్టు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment