రెండు గ్రామాల్లో గంగాదేవి గావు పండగ
కె.కోటపాడు : గుల్లేపల్లి, జోగన్నపాలెం గ్రామాల్లో గంగాదేవి(గావు ) పండగ పర్వదినాన్ని మంగళవారం ఆయా గ్రామస్ధులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి మూడేళ్లకు ఒక మారు రెండు గ్రామాల ప్రజలు ఆమ్మవారి పండగను నిర్వహించడం ఆనవాయితీ. ఆలయ ప్రాంగణంలో నిర్మాణం చేపట్టిన పందిరికి భక్తుల మొక్కులలో భాగంగా కొబ్బరి, అరటి, ద్రాక్ష పండ్లతో పాటు, నగదు, చీరలను వేలాడదీశారు. ఆయా వస్తువులను భక్తులు పొందేందుకు సాయంత్రం దోపిడీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులకు లభించే వస్తువులను అమ్మవారి ప్రసాదంగా భావిస్తారు. రెండు గ్రామాల్లో మధ్యాహ్నం అన్న సమారాధన జరిపారు.
మాజీ డిప్యూటీ సీఎం బూడి ప్రత్యేక పూజలు
గుల్లేపల్లి గ్రామంలో గంగాదేవి గావు పండగ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు. గంగాదేవికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆయనను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. అలాగే ఎంపీపీ రెడ్డి జగన్‌మోహన్, సర్పంచ్ బండారు దేముళ్లు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.
● పందిరికి అరటి, కొబ్బరి, నగదు తదితర వస్తువులను వేలాడదీసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు
రెండు గ్రామాల్లో గంగాదేవి గావు పండగ
Comments
Please login to add a commentAdd a comment