మహారాణిపేట (విశాఖ): ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్నికల కోడ్ ఎత్తి వేశారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఇక మీదట అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయన్నారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గత నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ జారీ నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. 27న పోలింగ్, ఈ నెల 3న ఓట్ల లెక్కింపు పూర్తయింది. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడు గెలుపొందిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment